Friday, September 20, 2019

Ysrcp supporter's

సెక్రటేరియట్ ఫలితాలు,పూర్తి వివరాలు

లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మహోత్తర ప్రక్రియలో కీలక ఘట్టాలు, అంశాలను ప్రభుత్వం​ ప్రకటన రూపంలోమీడియాకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.



రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న "నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు

ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము


క్రొత్తగా ఏర్పాటు చేసే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము

Thursday, September 19, 2019

YSRCP SUPPORTERS

 ‘సచివాలయ’ ఫలితాలు విడుదల

లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 
ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం..  కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు.
ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.  ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 1వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. 
ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తి చేశామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ‘ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి’  అని సీఎం జగన్‌ అన్నారు.

share to ysrcp supporters 

 

 

YSRCP SUPPORTERS

డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరు

 

పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష
డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ గురువారం  పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా ఎలా జరుగుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరఫరా సాఫీగా సాగుతుందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు
ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్‌ కమిషనర్ కోన శశిధర్ పాల్గొన్నారు.
share to all ysrcp supporters